
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్పకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక రిలీజైంది. పుష్ప రాజ్ పాత్రకు తగినట్టుగానే దాక్కో దాక్కో మేక సాంగ్ ఉంది. ఇక లిరికల్ సాంగ్ లో అల్లు అర్జున్ ఊర మాస్ యాటిట్యూడ్ అదిరిపోయింది. సినిమా కచ్చితంగా అల్లు, మెగా ఫ్యాన్స్ అందరికి పండుగ లాంటి సినిమా అవుతుందని ఒక్కపాటతో చెప్పేశారు.
పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. రికార్డుల వేటలో తగ్గేదేలే అన్నట్టుగా పుష్ప సినిమాతో తన పంజా విసురుతున్నాడు. డిసెంబర్ 25న నేషనల్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక అదిరిపోగా ఇక సినిమాలో మిగతా సాంగ్స్ తో కూడా దేవి తన టాలెంట్ చూపించాడని అంటున్నారు.