కాకినాడలో ఆమీర్ ఖాన్ సందడి..!

బాలీవుడ్ స్టార్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నారు. లడఖ్ లో 30 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్ లేటెస్ట్ గా కాకినాడలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. బాలీవుడ్ సినిమా కోసం కాకినాడ రావడం ఏంటని అనుకోవచ్చు. కథ ప్రకారం ఆమీర్ ఖాన్ రొయ్యల వ్యాపారం చేసే కుటుంబాన్ని కలుసుకోవాలట. తన స్నేహితుడు బాలా కుటుంబం కలిసేందుకు కాకినాడ వస్తాడు ఆమీర్ ఖాన్. ఇక సినిమాలో బాల పాత్ర చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. ఈమధ్యనే చైతు ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. కాకినాడలో ఆమీర్ ఖాన్ వారం రోజుల పాటు షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. 

మొత్తానికి బాలీవుడ్ సినిమాలో కాకినాడ హైలెట్ అవనుంది. లాల్ సింగ్ చద్దా సినిమాను ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చైతన్య బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా ఇదే అవడం విశేషం.