మెగా సర్ ప్రైజ్ ఇచ్చేశాడు.. ఇక సెలబ్రేషన్సే..!

మెగాస్టార్ రీ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఉంటుందో అని ఊహించిన ఫ్యాన్స్ కు అంతకంటే సూపర్ గా ప్లాన్ చేస్తుంది మెగా కాంపౌండ్. ఇక ప్రత్యేకంగా మాటివి ఓనర్స్ అయిన చిరు నాగార్జునలైతే మెగాస్టార్ రేంజ్ ను మళ్లోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన సినిమా అవార్డ్స్ లో మెగా చరిష్మా ఒక్కసారి గుర్తుచేశారు. అయితే ఇదే కాకుండా మాటివిలో కింగ్ నాగార్జున చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా నాలుగో సీజన్ లో మెగాస్టార్ కనిపించబోతున్నాడు. అదేనండి మెగాస్టార్ హోస్ట్ గా రాబోతున్న ఈ ప్రోగ్రాం ప్రోమో రీసెంట్ గా మాటివిలో టెలికాస్ట్ చేశారు.

కోట్ల హృదయాలను కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించాలని వస్తున్నాడు.. మెగా సెలబ్రేషన్స్ బిగిన్స్ సూన్ ఆన్ మాటివి అంటూ వస్తున్న ప్రోమో మెగా ఫ్యాన్స్ నే కాదు సిని అభిమానులను ఇంప్రెస్ చేస్తుంది. మూడు సీజన్స్ లో మెమరబుల్ మూమెంట్స్ తో నాగార్జున నడిపించగా ఇప్పుడు ఆయన స్థానంలో మెగాస్టార్ రాబోతున్నాడు.

ఇక ఇదో రకంగా తన సినిమాకు ఎంతోకొంత ఉపయోగపడుతుంది అన్న కారణం చేతనే మెగాస్టార్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రోమోతోనే వారెవా అనిపించిన మెగాస్టార్ ఇక అసలు సిసలైన ఆటలో దిగితే ఇంకెలా రెచ్చిపోతాడో చూడాలి. మొత్తానికి మాటివి వారు మెగా మేనియాతో టి.ఆర్.పి రేటింగ్ ను పెంచేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాం ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో చూడాలి.