
మళయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టుని తెలుగులో గీతా ఆర్ట్స్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో సత్యదేవ్, అంజలి లీడ్ రోల్స్ గా నటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు డైరక్టర్ గా పలాస ఫేం కరుణ కుమార్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుందిల్. పలాస సినిమా రిలీజ్ తర్వాత అల్లు అరవింద్ కరుణ కుమార్ టాలెంట్ కు మెచ్చి అప్పుడే ఒక సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆహాలో మెంట్రో కథలు వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు.
ప్రస్తుతం సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేశారు కరుణ కుమార్. ఈ సినిమా తర్వాత నయట్టు తెలుగు రీమేక్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. కంటెంట్ ఏదైనా తన డైరక్షన్ టాలెంట్ చూపించే కరుణ కుమార్ నయట్టు రీమేక్ ను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. గీతా ఆర్ట్స్ తో కరుణ కుమార్ నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.