
నాంది సినిమాతో హిట్ అందుకున్న అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమా సభకు నమస్కారం షురూ చేశాడు. తిమ్మరుసు సినిమాను నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. సతీష్ మల్లంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురువారం నాడు లాంచనంగా మొదలైంది. ముహుర్తపు సన్నివేశానికి నరేష్ కూతురు అయాన క్లాప్ కొట్టగా పోకూరి బాబురావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాంది తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది.
రొటీన్ సినిమాలతో కెరియర్ డైలమాలో పడేసుకున్న అల్లరోడు ఇక మీదట కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. నాంది తర్వాత తన కథల సెలక్షన్ లో పంథా మార్చేసిన అల్లరి నరేష్ సభకు నమస్కారం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్, కాస్ట్ అండ్ క్రూ త్వరలో తెలుస్తుంది.