
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లు తెరచుకోగా ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ లు ప్రారంభమయ్యాయి. ఆడియెన్స్ కూడా సినిమాలు చూసేందుకు వస్తున్నారు. తిమ్మరుసు, ఇష్క్ సినిమాల్లో తిమ్మరుసు మంచి ఫలితాన్ని అందుకోగా లాస్ట్ వీక్ ఎస్.ఆర్ కళ్యాణమండపంతో పాటుగా మరో నాలుగైదు సినిమాలు వచ్చాయి. వాటిలో ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రివ్యూస్ తో సంబంధం లేకుండా సినిమా వసూళ్లు బాగున్నాయని ట్రేడ్ టాక్. ఇక ఈ వారం కూడా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం 7 సినిమాలు శనివారం విశ్వక్ సేన్ పాగల్ రిలీజ్ అవుతుంది.
ఇక శ్రీవిష్ణు రాజరాజచోర ఆగష్టు 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆగష్టు 27న సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక సెప్టెంబర్ 3న మారుతి డైరక్షన్ లో వస్తున్న మంచి రోజులు వచ్చాయ్ రిలీజ్ ప్లాన్ చేయగా నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 16న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా తీవ్రత పెరగడంతో వాయిదా పడ్డది. ఫైనల్ గా లవ్ స్టోరీ ఈ వినాయక చవితికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమాతో పాటు రిలీజ్ ప్లాన్ చేసిన నాని టక్ జగదీష్ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు.