జూలో సింహంతో కాదు అడవిలో సింహం తో ఆడుకుంటా..!

యువ హీరోల్లో ఫుల్ జోష్ గా ఉండే విశ్వక్ సేన్ తన పాగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ మాస్ స్పీచ్ తో అదరగొట్టాడు. ఓ రకంగా పాగల్ క్యారక్టరైజేషన్ నుండి విశ్వక్ సేన్ ఇంకా బయటకు రాలేదేమో కాని సినిమా పక్కా హిట్. మూసుకున్న థియేటర్లు కూడా పాగల్ తో తెరిపిస్తా.. నేను జూలో సిం హంతో కాదు అడవిలో సిం హంతో ఆడుకునే టైప్ అంటూ స్టార్ హీరో రేంజ్ భారీ డైలాగులు అది కూడా స్టేజ్ మీద చెప్పేశాడు. ఇక తను మాట్లాడుతున్న టైం లో ఫ్యాన్స్ గోల చేస్తుంటే తాగుదాం ఆగండ్రా అంటూ స్టేజ్ మీద తాగుడు గురించి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడాడు.

దీన్ని హీరోయిజం అని తను అనుకోవచ్చు కాని చాలా మందికి మాత్రం విశ్వక్ సేన్ అతికి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే డిఫరెంట్ స్టోరీగా వస్తున్న పాగల్ కేవలం లవ్ స్టోరీగానే కాదు సెంటిమెంట్ తో కూడా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాగల్ సినిమా మీద విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.