ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు 'శ్రీదేవి సోడా సెంటర్'..!

సుధీర్ బాబు హీరోగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. విలేజ్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు పాత్రలో మాస్ లుక్ తో కనిపించనున్నారు. సినిమాలో శ్రీదేవిగా ఆనంది నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మందులోడా సాంగ్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించగా లేటెస్ట్ గా వచ్చిన నాలో ఇన్నాళ్లుగా సాంగ్ యువతని ఆకట్టుకుంటుంది.

70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మించారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి ఈసారి శ్రీదేవి సోడా సెంటర్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు. పలాస తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కరుణ కుమార్ ఈ సినిమాతో కూడా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేయగా సుధీర్ బాబు కెరియర్ లో ఈ సినిమా క్రేజీ హిట్ అందించేలా ఉంది. 

ఇక లేటెస్ట్ గా ఈ సినిమాను ఆగష్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. లైటింగ్ సూరి బాబు, సోడాల శ్రీదేవి వీళ్లిద్దరి లవ్ స్టోరీతో థియేటర్ దద్దరిల్లిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు చిత్రయూనిట్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈమధ్యనే థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి కథ, కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగు ఆడియెన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆల్రెడీ ఈమధ్య రిలీజైన సినిమాలతో ప్రూవ్ అయ్యింది. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ ను కూడా ఆగష్టు 27న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు.