కాటమరాయుడు రీమేక్ సినిమానా..?

సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే సినిమా షురూ చేసిన పవర్ స్టార్ ఆరంభం అదరగొట్టినా ఆ సినిమాను పూర్తి చేయడానికి మాత్రం నత్తనడక నడిపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు డేట్స్ ఇచ్చిన వారు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తాజా పరిణామాల దృష్ట్యా సినిమాలో కొంతమంది ఆర్టిస్ట్ లను, టెక్నిషియన్స్ ను మార్చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు కథ కూడా మార్చేస్తున్నారట.

ఆకుళ శివ అందించిన కాటమరాయుడు కథ ముందు నుండి నాంచుతూ వచ్చి చివరకు ఆ కథను పక్కనపెట్టి తమిళ సూపర్ హిట్ సినిమా వీరం ను తెరకెక్కిస్తున్నాడట. అజిత్ హీరోగా రూపొందిన ఆ సినిమా తెలుగులో డబ్ కాలేదు. అందుకే ఆ సినిమాను యాజిటీజ్ దించేస్తున్నాడట పవన్ కళ్యాణ్. డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ లో శరర్ మరార్ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా పవన్ రాకతో చిత్రయూనిట్ లో ఉత్సాహం వచ్చింది. తనకున్న టైంలోనే సినిమా మొత్తం పూర్తి చేసి ఈ నవంబర్ లో త్రివిక్రంతో మరో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్. మరి కొత్త కథగా మొదలైన కాటమరాయుడు రీమేక్ అన్నది ఎంతవరకు నిజమో సినిమాకు సంబందించిన వారు ఎవరైనా ఎనౌన్స్ చేస్తే గాని చెప్పలేం.