
ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫాం లో ఉంది. నానితో శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి, రామ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లింగుసామి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ కృతి శెట్టి మీద డైరక్టర్ లింగుసామి సీరియస్ అయ్యాడని టాక్. సినిమాలో నాజర్, కృతి శెట్టిల మధ్య ఒక ఎమోషనల్ సీన్ షూట్ చేస్తున్నారట. ఆ సన్నివేశానికి కావాల్సిన ఎమోషన్ ను కృతి నుండి రాబట్టడంలో డైరక్టర్ బాగా కష్టపడ్డాడని తెలుస్తుంది. ఈ సీన్ రీ టేక్స్ బాగా చేశారని టాక్. నాజర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని అంటున్నారు.
కృతి శెట్టి వల్ల డైరక్టర్ లింగుసామి అప్సెట్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఉప్పెనతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి నటన పరంగా ఇంకాస్త డెవలప్ మెంట్ చేసుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో రాం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని టాక్. రాం, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.