ఐకాన్ లో కూడా రష్మిక..?

పుష్ప తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వకీల్ సాబ్ తో హిట్ అందుకున్న డైరక్టర్ వేణు శ్రీరాం అల్లు అర్జున్ తో ఐకాన్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 పూర్తి చేసి పార్ట్ 2 షూటింగ్ తో పాటుగా ఐకాన్ ని కూడా ఫినిష్ చేయాలని చూస్తున్నాడని తెలుస్తుంది.

అందుకే ఐకాన్ కోసం అల్లు అర్జున్ 3 నెలల డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో రష్మిక నటిస్తుంది. సినిమాలో ఆమె నటన చూసి బన్నీ రష్మికనే ఐకాన్ లో కూడా తీసుకోవాలని రిఫర్ చేస్తున్నాడట. అసలైతే అల్లు అర్జున్ ఐకాన్ లో పూజా హెగ్దే హీరోయిన్ అని వార్తలు వచ్చాయి. కాని లేటెస్ట్ గా పూజా ప్లేస్ లో రష్మిక ఆ ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు.