
రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వానిని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా ఉంటే బాలీవుడ్ లో కూడా సినిమాకు డిమాండ్ ఉంటుందని ఆమెను సెలెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు కియరా అద్వాని భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్సీ 15 కోసం కియరా అద్వాని 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.
ఇప్పటికే శంకర్ అండ్ టీం లొకేషన్స్ వేటలో పడ్డారు. ఆంధ్రా, తెలంగాణాల్లోనే మేజర్ పార్ట్ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. కొన్ని సీన్స్ కోసం మాత్రమే ఫారిన్ లొకేషన్స్ వాడుతారట. ఐ, 2.ఓ సినిమాలతో అంచనాలను అందుకోని శంకర్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తర్వాత చరణ్ ఈ మూవీతో మరో రేంజ్ కి వెళ్తాడని చెప్పొచ్చు.