
కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ సినిమా కన్ ఫర్మ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్ పురం దొంగ పేరుతో ఈ సినిమా వస్తుంది. స్టువర్ పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ గా ఈ సినిమా వస్తుంది. 1970 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాను కొన్నాళ్లు రవితేజ, రానా లాంటి హీరోలు చేస్తారని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తుండగా వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన కె.ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పట్లో స్టువర్ట్ పురం అంటే దొంగలకు చాలా ఫేమస్. ఆ దొంగల గ్యాంగ్ లో టైగర్ నాగేశ్వర రావుది చాలా పెద్ద పేరు. వెండితెర మీద టైగర్ కథ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.