నాలో ఇన్నాళ్లుగా.. శ్రీదేవి సోడా సెంటర్ నుండి సూపర్ మెలోడీ..!

పలాస 1978తో సత్తా చాటిన డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మొదటి సాంగ్ మందులోడా సాంగ్ సూపర్ హిట్ కాగా సినిమా నుండి సెకండ్ సాంగ్ గా మెలోడీ సాంగ్ నాలో ఇన్నాళ్లుగా సాంగ్ రిలీజ్ చేశారు. 

మణిశర్మ మార్క్ మెలోడీ సాంగ్ గా వచ్చిన నాలో ఇన్నాళ్లుగా సాంగ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా సంగీత ప్రియులను ఈ సాంగ్ అలరిస్తుంది. టీజర్ తోనే కాదు సాంగ్స్ తో కూడా సినిమాపై అంచనాలు పెంచుతున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నాలో ఇన్నాళ్లుగా సాంగ్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో మణిశర్మ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.