రవితేజ ఇరుముడి: భక్తి చిత్రం కాదట!

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ‘ఇరుముడి’ టైటిల్‌తో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుముడితో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూసి మాస్ మహారాజ్ రవితేజ హటాత్తుగా భక్తి చిత్రం చేస్తున్నారేమిటి?అని చాలా మందికి సందేహం కలిగింది. కానీ ఇది భక్తి చిత్రం కాదని, తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామా అని ఈ సినిమా సంగీత దర్శకుడు జీవి. ప్రకాష్ కుమార్‌ స్పష్టం చేశారు.      

ఈ సినిమాలో రవితేజకు భార్య కావేరీగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవి. ప్రకాష్ కుమార్‌ నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్‌ విడుదల కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘ఇరుముడి’లో అయ్యప్పస్వామిని కీర్తించే ‘ఎక్కినాడు పల్లకీ’ అనే పాట రీమిక్స్ చేస్తున్నారా? అని విలేఖరులు ప్రశ్నించారు. వారికి సమాధానం చెపుతూ ఈ పాపులర్ పాటని రీమిక్స్ చేయాలని నన్ను చాలా మంది కోరారు. కానీ దీనిపై దర్శక, నిర్మాతలే నిర్ణయం తీసుకోవాలి. వారు ఓకే అంటే నేనూ సిద్ధం,” అని జీవి. ప్రకాష్ కుమార్‌ అన్నారు.        

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఇరుముడి సినిమా నిర్మిస్తున్నారు.