అంజలికి మరో లక్కీ ఛాన్స్..!

తెలుగు అమ్మాయి అంజలి తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో సక్సెస్ అయిన తర్వాత తెలుగులో ఛాన్సులు అందుకున్న అంజలి కేవలం హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా అంజలి నటించి మెప్పించింది. ఇక లేటెస్ట్ గా మళయాళ రీమేక్ లో లీడ్ రోల్ చేస్తుంది అంజలి. మళయాళంలో హిట్టైన నయట్టు సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ రీమేక్ చేస్తుంది.

సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. తమిళ వర్షన్ ను గౌతం మీనన్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆయన్నే తెలుగులో కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్టు టాక్. ఒకవేళ ఆయన కాకుంటే సుధీర్ వర్మకు ఆ ఛాన్స్ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ రీమేక్ చేస్తుంది అంటే తప్పకుండా సినిమాలో విషయం ఉన్నట్టే లెక్క. తప్పకుండా అంజలి కెరియర్ కు ఇది మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు.