
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల ట్విస్ట్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా హేమ నరేష్ తన అధ్యక్ష పదవి కొనసాగించేందుకే ఎన్నికలు లేకుండా చేస్తున్నారంటూ ఓ వాయిస్ మెసేజ్.. మా సభ్యులకు కొంతమందికి లేఖలు రాయడం జరిగింది. దీనికి కౌంటర్ గా నరేష్, జీవిత రాజశేఖర్ కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇక వ్యవహారం మరింత ముదురుతుంది అనుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. లేటెస్ట్ గా చిరంజీవి క్రశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖ రాశారు.
మా ప్రతిష్ట మనసకబారుతుంది.. వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలని చిరంజీవి లేఖలో ప్రస్థావించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన మా ఎన్నికలు ఈసారి కొవిడ్ 19 వల్ల వాయిదా పడ్డాయని.. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపద్ధర్మ కమిటీ అని.. వీరి స్థానంలో శ్వాశ్వత కమిటీ వస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలు ఉంటుందని చిరు లేఖ లో రాశారు. పరిశ్రమ పెద్దలు.. అన్ని విషయాలు తెలిసినవారు త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని చిరంజీవి కోరారు. మా సభ్యులు చిన్న చిన్న మనస్పర్ధలని మీడియా ముందుకు తీసుకు వచ్చి సమస్యని పెద్దది చేస్తున్నారని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు.