
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న పుష్ప సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతుండగా.. మరో పక్క గుణశేఖర్ డైరక్షన్ లో సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే చోట జరుగుతుండటం విశేషం. పుష్ప షూట్ గ్యాప్ లో అల్లు అర్హ శాకుంతలం సినిమా కోసం చేస్తున్న షూటింగ్ ను చూసి మురిసిపోతున్నాడు బన్నీ.
పుష్ప సినిమా పార్ట్ 1 క్రిస్ మస్ రేసులో దించుతున్నాడు సుకుమార్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 13న సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో అలరించాడు. ఇప్పుడు శాకుంతలం సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్ చేస్తుంది.