మహేష్ బర్త్ డే బ్లాస్టర్.. అదిరింది..!

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నా ఈ సినిమా నుండి మహేష్ బర్త్ డే సందర్భమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. ఎప్పటిలానే మహేష్ తన ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టగా ఓ క్రేజీ డైలాగ్ తో టీజర్ వచ్చింది.

పరశురాం తనకు వచ్చిన ఈ బిగ్ ఛాన్స్ ను బాగానే వాడుకున్నట్టు ఉన్నాడు. సినిమాలో మహేష్ స్టైల్ మరోసారి పోకిరి సినిమా గుర్తు చేస్తుంది. 2022 సంక్రాంతికి మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. బర్త్ డే బ్లాస్టర్ గా వచ్చిన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.