
కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ఓ మై కడవులే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, మిథిలా పార్ల్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తాడని అంటున్నారు. తమిళంలో ఓ మై కడవులే సినిమాలో విజయ్ సేతుపతి చేసిన గెస్ట్ రోల్ లో తెలుగులో అల్లు అర్జున్ నటిస్తాడని అంటున్నారు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి దేవుడిగా కనిపించాడు. తెలుగు వర్షన్ లో అల్లు అర్జున్ మోడ్రన్ గాడ్ గా కనిపిస్తాడని అంటున్నారు. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో మెప్పించారు.
ఇక ఇప్పుడు ఓ మై కడవులే తెలుగు రీమేక్ లో కూడా బన్నీ నటిస్తాడని అంటున్నారు. మరి అల్లు అర్జున్ ఈ రీమేక్ లో నిజంగా నటిస్తున్నాడా లేదా అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. విశ్వక్ సేన్ పాగల్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.