ఐడి కార్డుతో ఎన్.టి.ఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెడలో ఐడి కార్డ్ తో కనిపించాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో అందరు ఐడి కార్డులతో కనిపించారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సాంగ్ ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ స్పాట్ లో నందమూరి తారక రామారావు హీరో అని ఐడి కార్డ్ తో ఎన్.టి.ఆర్ కనిపించారు. అంతేకాదు మరో ఫోటోలో రాజమౌళి కూడా తన ఐడిని చూపిస్తూ కనిపించారు.

ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ వంటి స్టార్ హీరోయిన్స్ గా కూడా నటిస్తున్నారు. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ కనిపిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ ప్రకటించారు.