ఫ్యాన్స్ కు మహేష్ రిక్వెస్ట్..!

సూపర్ స్టార్ మహేష్ ఆగష్టు 9న తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. మహేష్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కు పండుగే.. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా గ్రేట్ గో గ్రీన్ ఇనిషియేటివ్ తో ముందుకొచ్చారు మహేష్. టీ.ఆర్.ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే నాడు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మహేష్. పర్యావరణ సమతుల్యత కాపాడటానికి కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు నాటి తన మీద ఉన్న ప్రేమని తెలియచేయాలని చెప్పారు మహేష్.      


ప్రతిసారి నాపై మీకున్న ప్రేమని చూపించడానికి మీరు చేస్తున్న పనులన్ని ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఏడాది మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ చేతున్నాను.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సపోర్ట్ గా ప్రతి ఒక్క అభిమాని 3 మొక్కలు నాటాలని అందరిని కోరుతున్నానని అన్నారు మహేష్. మీ పోస్టులతో తనని ట్యాగ్ చేయాలని మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ కోరిక మేరకు ఫ్యాన్స్ మహేష్ చెప్పినట్టుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎలా నిర్వహితారో చూడాలి.