టక్ జగదీష్ ఓటీటీ లోనా..?

తెలుగు ఇండస్ట్రీలో మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని తర్వాత వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది వి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మళ్లీ కరోనా ప్రభావంతో ఆయన నటించిన టక్ జగదీశ్ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదాలు పడుతూ వస్తుంది. నిన్నుకోరి తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల వి ఓటీటీలో రిలీజ్ చేశారు.. అయితే ఇది నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకే ప్రస్తుతం టక్ జగదీష్ ను ఓటిటిలో రిలీజ్ చేయాలా వద్ద అన్న విషయంలో తర్జన భర్జన జరుగుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు సినిమాకు అమేజాన్ ప్రైమ్ క్రేజీ డీల్. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు 35 కోట్ల ఆఫర్. నిర్మాతలు ఓకే ఆలోచిస్తున్నారని టాక్. 

ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని పేర్కొన్న చిత్ర బృందం.. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ను కూడా ప్రకటిస్తామని తెలిపింది.  మరి ఇది ఎంత వరకు నిజమో కాదో కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం తెగ టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.