
కెరియర్ లో ఒక్క హిట్ సినిమా అది కూడా నాని లాంటి హీరోతో ఏదో అలా ఆడించేశారు అలాంటి డైరక్టర్ తో భాగమతి చేస్తున్న అనుష్క సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక ఆమె ఆలోచనలు ఎలా ఉన్నా సినిమా నిర్మాతలు యువి క్రియేషన్స్ వారు మాత్రం సినిమాను భారీ రేంజ్లో అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగమతి కోసం వచ్చిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి చుక్కలు చూపించేశారు.
అనుష్క ఇమేజ్, యువి క్రియేషన్స్ బ్యానర్ వాల్యూ ఇవన్ని చూసి ఓ పంపిణీదారుడు 4 కోట్ల ఆఫర్ చిత్రయూనిట్ ముందు పెట్టారట. అయితే యువి వారు మాత్రం 7 కోట్లకు కనీసం ఒక్క పైసా తగ్గేది లేదు అని అంటున్నారట. దాదాపు డబుల్ అమౌంట్ చెప్పేసరికి ఆ డిస్ట్రిబ్యూటర్ షాక్ అయ్యాడట. యువి వారు చెప్పిన ఫిగర్ కలెక్ట్ చేయాలంటే ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్ వసూళు చేయాలి మరి అంత సీన్ భాగమతికి ఉందా అన్నది ముందున్న ప్రశ్న.
రీసెంట్ గా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమానే ఓవర్సీస్ లో 7 కోట్లకు అమ్మేశారు మరి అలాంటిది భాగమతి కూడా అదే రేంజ్ అంటే నమ్మేలా లేదు. ఎనీహౌ సినిమా మీద ఇంత డిమాండ్ చేస్తున్నారు అంటే సినిమా కచ్చితంగా బాగా వస్తుండొచ్చు. మరి చివరకు ఎంతకు ఈ బేరం తెగుతునో కాని ఒక్కసారిగా ఓవర్సీస్ రైట్స్ తో భాగమతి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.