సుమంత్ రెండో పెళ్లి.. అసలు విషయం ఇది..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ రెండో పెళ్లి అంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవి లాంటి వాళ్లు ఒక పెళ్లే దండగ అనుకుంటే రెండో పెళ్లేంటయ్యా సుమంత్ నీ ఖర్మ అని సెటైర్లు వేశారు. అయితే ఫైనల్ గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు సుమంత్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. తన పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనారు. కేవలం ఒక సినిమాలో భాగంగా పెళ్లి కార్డ్ ప్రింట్ చేయగా అది నిజం అనుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు.

ఇక తను చేస్తున్న సినిమా మంచి కంటెంట్ తో వస్తుందని. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో వెల్లడిస్తామని చెప్పారు సుమంత్. మొత్తానికి సుమంత్ పెళ్లిపై వచ్చిన వార్తలన్ని మీడియా అత్యుత్సాహమనే తెలుస్తుంది. సినిమా షూటింగ్ లో లీకైన పెళ్లి కార్డ్ ను పట్టుకుని సుమంత్ పెళ్లంటూ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చివరకు సుమంత్ క్లారిటీ ఇచ్చాక అసలు విషయం ఏంటన్నది తెలిసింది.