
బాలయ్య వందవ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రూపొందుతుంది. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఓ రేంజ్లో చేస్తుంది. ఇప్పటికే బాలయ్య ఏ సినిమా చేయని రేంజ్లో ఈ సినిమా బిజినెస్ చేస్తుంది.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్రా మొత్తం 30 కోట్లు, నైజాం 18 కోట్లు పలుకుతుండగా సీడెడ్ వారాహి మూవీస్ మొత్తంగా 9 కోట్లకు రైట్స్ కొనేశారట. బాలయ్య ఏ సినిమాకు ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని చెప్పాలి. హిస్టారికల్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై దర్శకుడు క్రిష్ చాల కష్టపడుతున్నాడు.
ఇక సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలబడుతుందని అంటున్నారు. ఓ పక్క నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రెస్టిజియస్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తూ సాయి కొర్రపాటి తన అభిరుచిని చాటుతున్నారు.