రాధే శ్యామ్ రిలీజ్ డేట్..!

ప్రభాస్, పూజా హెగ్దే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో 3 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంటుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే సినిమా నుండి బిగ్ సర్ ప్రైజ్ వస్తుందని అన్నారు డైరక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమాకు సంబందించి టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది.

ఇక ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం రాధే శ్యామ్ సినిమాను 2022 సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నారట. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, పవన్.. రానా చేస్తున్న అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ కూడా పొంగల్ వార్ కు సిద్ధమైంది. తప్పకుండా ఈ సినిమల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు.