రవితేజ రామారావులో మరో హీరో..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. మూవీలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో వేణు నటిస్తున్నాడని తెలుస్తుంది. చిత్రయూనిట్ కూడా ఈ విషయాన్ని అఫీసిహ్యల్ గా ప్రకటించింది. హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రయత్నించిన వేణు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మళ్లీ వేణుని తెస్తున్నారట. సినిమాలో వేణు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేల అందరిలా వేణు కూడా సెకండ్ ఇన్నింగ్స్ విలన్ గా ప్రయత్నిస్తున్నాడా అన్న డౌట్ కూడా లేక పోలేదు. మొత్తానికి మాస్ రాజా సినిమాలో వేణు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది.