
ఆరెక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి సెకండ్ ప్రయత్నం గా చేస్తున్న సినిమా మహా సముద్రం. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇద్దరు హీరోలు ఇంటెన్స్ లుక్ తో కనిపించారు. సినిమా పోస్టర్ తోనే అంచనాలు పెంచాడు డైరక్టర్ అజయ్ భూపతి.
ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటిస్తున్నాడు. అంతకుముందు టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు ఈమధ్య కాలంలో ఇక్కడ సినిమాలు చేయడం మానేశాడు. మహా సముద్రంతో మళ్లీ తెలుగులో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు సిద్ధార్థ్. ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అనిపిస్తుంది. సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Here is the #Mahasamudram🌊 motion poster
Yemantarandi? ❤️@ImSharwanand @aditiraohydari @anuemmanuel@DirAjayBhupathi @AnilSunkara1
Let's begin the saga. ❤️🔥🗡️🌊 pic.twitter.com/ejS2196hF6