అఖిల్ కి కూడా ఆమే కావాలట..!

ఉప్పెన సినిమా ఒక్కటి చేసి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది కృతి శెట్టి. ఆ సినిమాతో అమ్మడికి వచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాదు ఉప్పెన ఒక్క సినిమా హిట్ అయితే దాదాపు అమ్మడికి ఐదారు సినిమాల ఆఫర్లు వచ్చాయి. అందుకే అక్కినేని నాగార్జున చేస్తున్న బంగార్రాజు సినిమా కూడా ఉందని తెలుస్తుంది. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య సరన్స కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే అన్న హీరోయిన్ పై ఇప్పుడు తమ్ము కూడా కన్నేసినట్టు తెలుస్తుంది.  

నాగ చైతన్యతో జోడీ కడుతున్న కృతి శెట్టి అఖిల్ తో కూడా జోడీ కడుతుందని తెలుస్తుంది. అఖిల్ బ్యాచిలర్ తర్వాత చేస్తున్న సినిమా ఏజెంట్ ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు సీన్మాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కాని ఇప్పుడు అఖిల్ కృతి శెట్టిని తీసుకోవాలని ఫోర్స్ చేస్తున్నాడట. అఖిల్ కోసం కృతి శెట్టితో చర్చలు నడిపిస్తున్నారని తెలుస్తుంది. చైతుతో పాటుగా అఖిల్ తో కూడా కృతి శెట్టి నటించే ఛాన్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కృతి శెట్టితో సినిమా అంటే కోటిన్నర పైగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. ఒక్క సినిమాతో ఈ రేంజ్ రెమ్యునరేషన్ పెంచిన హీరోయిన్ కేవలం కృతి శెట్టి మాత్రమే అని చెప్పాలి.