
కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమాతో హిట్ అందుకున్న నాగ్ సినిమాకు ప్రీక్వల్ గా బంగర్రాజు సినిమా ప్లాన్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. చైతు సరసన ఉప్పెన భామ కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో నాగార్జునకు జోడీగా ముందు రమ్యకృష్ణని అనుకున్నా ఇప్పుడు ఆ ఛాన్స్ శ్రీయ శరణ్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
పెళ్లి తర్వాత శ్రీయ కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఫీమేల్ లీడ్ గా కాకపోయినా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శ్రీయ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. బంగార్రాజులో శ్రీయ నటించడం నిజంగానే ఆమెకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.