
నాచురల్ స్టార్ నాని శ్యాం సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేశాడు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈమధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసిన శ్యాం సింగ రాయ్ ఫైనల్ గా సినిమాకు గుమ్మడికాయ కొట్టేసింది. శ్యాం సింగ రాయ్ అలా పూర్తయిందో లేదో నాని అంటే సుందరానికీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఇదే కాకుండా నూతన దర్శకుడు శ్రీకాంత్ చేస్తున్న సినిమాలో కూడా నాని నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారని టాక్.
సినిమాలో నాని తెలంగాణా కుర్రాడిగా కనిపిస్తాడట. సినిమా కోసం తెలంగాణ యాసని నేర్చుకుంటున్నాడట. స్పెషల్ ట్యూటర్ ను పెట్టించుకుని మరి తెలంగాణా స్లాంగ్ నేర్చుకుంటున్నాడట నాని. కృష్ణార్జున యుద్ధం కోసం రాయలసీమ యాసలో మాట్లాడిన నాని కొత్త సినిమా కోసం తెలంగాణా యస ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.