
మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ గా పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత తిరిగి మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. దీనికి సంబందించిన ఓ స్పెషల్ ఆన్ లొకేషన్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో ఖాకీ డ్రెస్ వేసుకుని పవన్ కళ్యాణ్.. డాన్ లుక్ లో రానా కనిపిస్తున్నారు.
సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో పవన్ నటిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ అని కూడా ఎనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ సెకండ్ హాఫ్ నుండి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్ని కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డాయి. మరి ఇప్పుడు ఏకే రీమేక్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా అనుకున్న టైం కు అది వచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి. 2022 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాను కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు.