విజయ్ దేవరకొండ కథతో మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్రా కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. లూసిఫర్ రీమేక్ తో పాటుగా చిరు ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ సినిమా కథ ముందు డైరక్టర్ కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడని రౌడీ హీరోకి కథ నచ్చినా డేట్స్ అడ్జెట్ కాక ఆ సినిమా కాదని చెప్పగా అదే కథతో చిరుని ఒప్పించాడట కె.ఎస్ రవీంద్ర. 

విజయ్ కథ చిరుకి ఎలా సెట్ అవుతుందని డౌట్ రావొచ్చు. లైన్ నచ్చిందని చెప్పగానే మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్టుగా కథ, కథనాలు మార్చేశాడట డైరక్టర్ కె.ఎస్ రవీంద్ర. జై లవ కుశ, వెంకీ మామ హిట్లతో తన సత్తా చాటిన కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్నారని తెలుస్తుంది.