డియర్ కామ్రేడ్ కు రెండేళ్లు.. విజయ్ దేవరకొండ ట్వీట్..!

మేము చేయాల్సింది చేశాం అంటూ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలీజై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్వీట్ చేశారు. భరత్ కమ్మ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. సినిమా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజైంది. రిలీఎజ్ ముందు అంచనాలు భారీగా ఉన్న రిలీజ్ తర్వాత ప్రేక్షకులను నిరాశపరచింది.

గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన సినిమాగా డియర్ కామ్రేడ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆడియెన్స్. అయితే ఇద్దరు తమ నటన పరంగా మెప్పించినా సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవలేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.