
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ సెట్స్ మీద ఉంది. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ రీమేక్ సినిమాకు త్రివిక్రం మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని రివీల్ చేశారు. సినిమా షూటింగ్ స్పాట్ లో పవర్ స్టార్ ఖాకీ డ్రెస్ లో ఉన్న పిక్ కూడా షేర్ చేశారు. దాదాపు సినిమాలో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అయ్యి ఉండొచ్చని చెబుతున్నారు. పోలీస్ ఆఫీసర్, డాన్ ల మధ్య ఈగో ఫైట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.