
రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో ఉంటుందని తెలుస్తుంది. ఒలివియా మోరిస్, అలియా భట్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ టీ సీరీస్, లహరి మ్యూజిక్ కలిసి తీసుకున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆడియో రైట్స్ 25 కోట్ల దాకా పలికినట్టు తెలుస్తుంది.
ఈ రేంజ్ లో ఆడియో రైట్స్ సేల్ అయిన సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఆర్.ఆర్.ఆర్ మొదటిదని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపంతో అలరిస్తారని అంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.