మారుతి మంచి రోజులు వచ్చాయి .. టీజర్ అదిరింది..!

తెలుగులో సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరైన మారుతి ప్రతిరోజూ పండుగే తర్వాత పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయ్ సినిమాలు చేస్తున్నారు. పక్కా కమర్షియల్ గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా కాగా మంచి రోజులు వచ్చాయి సినిమా సంతోష్ శోభన్ హీరోగా వస్తుంది. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా క్యారక్టర్ ఇంట్రో టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తేనే సినిమా ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అని అర్ధమవుతుంది.

ఇక టీజరే ఇలా ఉంటే సినిమా మొత్తం ఎలా ఉంటుందో అని ఎక్సయిట్మెంట్ మొదలైంది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లోనే తెరకెక్కించారు మారుతి. ఈ సినిమాలో మారుతి తన మార్క్ కామెడీతో సినిమా నడిపించాడని తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మంచి రోజులు వచ్చాయి క్యారక్టర్ ఇంట్రో టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.