సూపర్ హీరో అవుతున్న దగ్గుబాటి రానా..!

దగ్గుబాటి సినీ వారసుడు రానా హీరో కమ్ విలన్ గా సత్తా చాటుతున్నాడు. అయితే స్టార్ రేసులో వెనక పడ్డ రానా ఇక మీదట తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ప్రత్యేకమైన సినిమాలతో పాటుగా మాస్ యాక్షన్ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రానా నటించిన విరాటపర్వం రిలీజ్ కు రెడీగా ఉండగా అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాల తర్వాత రానా ఓ సూపర్ హీరో కథతో వస్తున్నాట్టు తెలుతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తానొక సూపర్ హీరో సినిమా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రానా.

ఇంతకీ ఆ సూపర్ హీరో కథ ఏంటి.. ఆ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. మాములుగా ఇలాంటి సూపర్ హీరో మూవీస్ బాలీవుడ్ వాళ్లు ప్రయత్నిస్తారు. తెలుగులో మొదటి సూపర్ హీరోగా రానా మారాలని చూస్తున్నాడు. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి.