
విక్టరీ వెంకటేష్ నారప్పతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ నటనకు అందరు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ మరో రీమేక్ లో నటించారు. మళయాళంలో సూపర్ హిట్టైన దృశ్యం 2 సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. దృశ్యం హిట్ కాగా ఈ సీక్వల్ పై అంచనాలు పెరిగాయి. ఈసారి మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాను నారప్ప లానే ఓటీటీ కి అమ్మేశారు. దృశ్యం 2 సినిమాను డిస్నీ హాట్ స్టార్ కు అమ్మేశారు.
సెప్టెంబర్ 9 లేదా 10వ తారీఖు డిస్నీ హాట్ స్టార్ లో వెంకటేష్ దృశ్యం 2 రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. మళయాళ వర్షన్ సూపర్ హిట్ కాగా తెలుగులో కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ ఎఫ్3 సినిమా సెట్స్ మీద ఉంది. అయితే ఆ సినిమా మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.