
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శనివారం ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా ఓపెనింగ్ కు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అటెండ్ అయ్యారు. సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపిక పదుకొనెని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ K అని పెట్టారు.
టైటిల్ కు రిలేటెడ్ గా ప్రాజెక్ట్ K అని పెట్టడం విశేషం. ప్రభాస్ రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ లతో పాటుగా ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. అయితే రాధే శ్యాం సింగిల్ షెడ్యూల్ తో పూర్తి కానుంది. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.