బన్నీ కోసం సన్నీ ఐటం..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ అదిరిపోయేలా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామలను దించుతున్నారని అంటున్నారు. దిశా పటాని, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇద్దరిని అడిగితే ఎవరు చేయనని చెప్పారట. ఇక లేటెస్ట్ గా పుష్ప ఐటం కోసం సన్నీ లియోన్ ను ఎంపిక చేసినట్టు టాక్.

పుష్పలో స్పెషల్ సాంగ్ కోసం సన్నీ లియోన్ అర కోటి దాకా రెమ్యునరేషన్ అడిగిందని తెలుస్తుంది. సినిమాలో ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. మాములుగానే సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ స్పెషల్ గా ఉంటాయి. పుష్పలో ఈ ఐటం సాంగ్ కోసం మరింత కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.