
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్ ఆంటోని. తమిళంలో కన్నా తెలుగులో ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా సీక్వల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. నేడి విజయ్ ఆంటోని బర్త్ డే కానుకగా బిచ్చగాడు 2 పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్వల్ సినిమాను విజయ్ ఆంటోని స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. బిచ్చగాడు సినిమాను శశి డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సీక్వల్ ను మాత్రం విజయ్ ఆంటోని డైరెక్ట్ చేస్తున్నారు.
డైరక్షన్ ఒక్కటే కాదు నిర్మాత మ్యూజిక్ డైరక్టర్ హీరో అన్ని తానై నడిపిస్తున్నాడు. బిచ్చగాడు 2 అనగానే ఆ సినిమా అభిమానులంగా పార్ట్ 2 మీద అంచనాలు పెంచుకున్నారు. మరి ఈ సినిమాకు అన్ని తానై ఉంటున్న విజయ్ ఆంటోని ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ రిలీజ్ చేశారు. మరి బిచ్చగాడు 2 ఎలా ఉండబోతుందో చూడాలి.