
కోలీవుడ్ హీరోనే అయినా తెలుగులో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో సూర్య. ప్రస్తుతం కోలీవుడ్ లో 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య శుక్రవారం బర్త్ డే సందర్భంగా సూర్య 40 వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక సూర్య నటిస్తున్న 39వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. టీకే జ్ఞానవేల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు కెత్తట్టిల్ ఒరుదన్ అనే టైటిల్ తమిళంలో పెట్టారు. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకే తెలుగులో జై భీమ్ టైటిల్ తో పోస్టర్ వదిలారు. ఈ మూవెలో సూర్య లాయర్ గా నటిస్తున్నారు.
వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. జై భీమ్ ఫస్ట్ లుక్ లో గిరిజన తెగకు చెందిన ప్రజలు పోస్టర్ లో కనిపిస్తున్నారు. గిరిజన తెగల హక్కులు వారి సమస్యల కోసం పోరాడే లాయర్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమాకు పవర్ ఫుల్ గా జై భీం అని టైటిల్ పెట్టడం ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాను సూర్య తన ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.