
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన సినిమా నారప్ప. ఈమధ్యనే అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఆడియెన్స్ నుండే కాదు సెలబ్రిటీస్ కూడా నారప్ప సినిమాపై ప్రశంసలు కురిపించారు. లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.
నారప్ప చూశాను వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ ఏమాత్రం కనబడలేదు. ఎప్పుడూ కొత్త పాత్రలు చేయాలనుకునే తపన ఉండే వెంకటేష్ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో వెంకటేష్ తన నటనతో మెప్పించారని అన్నారు. వెంకటేష్ కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ కు వెంకటేష్ కూడా అదే విధంగా స్పందించారు. నారప్పపై స్పందించిన చిరుకి థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్.