ప్రభాస్ మరో అరుదైన రికార్డ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సం ఏషియన్ మెన్ 2021 లిస్ట్ లో నెంబర్ 1 గా నిలిచాడు ప్రభాస్. అంటే ఏసియాలోనే ప్రభాస్ ను మించిన అందగాడు లేడని ఈ సర్వే వెల్లడించింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మాములుగా ఇలాంటి సర్వేలు జరిగితే ఎక్కువగా బాలీవుడ్ హీరోలే టాప్ టెన్ లిస్ట్ లో ఉంటారు కాని ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా సత్తా చాటుతున్నారు. ఏసియన్ మోస్ట్ హ్యాండ్సం లిస్ట్ లో టాప్ 1 గా నిలిచి అందరికి షాక్ ఇచ్చాడు ప్రభాస్.

ప్రభాస్ ఈ లిస్ట్ లో టాప్ 1 గా నిలవడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ రాధే శ్యాం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పాటుగా సలార్, ఆదిపురుష్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో నేషనల్ వైడ్ గా మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్.