
మా ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. ఈసారి ఐదుగురు సభ్యులు పోటీలో ఉండగా ఎవరికి వారు తమ ప్లాన్లలో బిజీగా ఉన్నారు. రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టి.. తన ప్యానెల్ సభ్యులను ప్రకటించి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు ప్రకాష్ రాజ్. ఇక పోటీలో ఉన్న మంచు విష్ణు మా బిల్డింగ్ పూర్తి బాధ్యత నాదే అని ఒక వీడియో పెట్టాడు. ఇక లేటెస్ట్ గా మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మాట్లాడాడు మంచు విష్ణు. తమ కుటుంబం చాలామందికి చాలా చేసిందని. తమ వద్ద సహాయం పొందిన వారు ఉన్నారని అన్నారు.
ఇక జైలుకి వెళ్లాల్సిన వారు బయట తిరుగుతున్నారని.. ఆ వివరాలు త్వరలో బయటపెడతానని అన్నారు. మాలో కేవలం సొంత భవన సమస్యలే కాదు ఇంకా చాలా ఉన్నాయని అన్నరు. దాసరి నారాయణ రావు తర్వాత సినీ పెద్ద ఎవరు లేకుండా పోయిందని అన్నారు. నాగేశ్వ రావు, దాసరి నారాయణ రావు ఉన్నప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అయ్యేదని గుర్తు చేశారు. మా భవనం ప్లేస్ ఎలా సాధిస్తారన్న నాగ బాబు కామెంట్ కు సమాధానంగా ఆ బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు మంచు విష్ణు. మా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయితే తాను పోటీల్లోంచి తప్పుకుంటానని ఇదివరకు చెప్పారు మంచు విష్ణు.