పుష్ప షూటింగ్ కు మళ్ళీ బ్రేక్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడ్డదని తెలుస్తుంది. సినిమా దర్శకుడు సుకుమార్ కు వైరల్ ఫీవర్ రావడమే దీనికి కారణమని తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈమధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభించిన సుకుమార్ అండ్ టీం మళ్లీ అనుకోకుండా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సుకుమార్ ఫీవర్ తగ్గిన తర్వాతే మిగతా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఈమధ్యనే వచ్చిన పుష్ప టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ముందు ఒక పార్ట్ అనుకున్న పుష్ప ఇప్పుడు రెండు పార్టులుగా రాబోతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.