
బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి మాట్లాడంటే చాలు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు. మీడియా ఇంటర్వ్యూస్ లో బాలకృష్ణ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. లెటెస్ట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో బాలయ్య బాబు హాట్ టాపిక్ గా మారాడు. లెజెండరీ మ్యూజిక్ డైరక్టర్ ఏ.ఆర్.రెహమాన్ పేరు తీసుకొచ్చి మరి ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చాడు బాలకృష్ణ. ఆదిత్య 369 సినిమా మ్యూజిక్ గురించి చెబుతూ ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా చెబుతూ సంగీత దర్శకులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందని అన్నారు బాలకృష్ణ. రెహమాన్ పేరు ఎత్తి ఆయన ఎవరో తెలియదనడమే కాకుండా పదేళ్లకు ఒక హిట్టు ఇస్తాడని చెప్పాడు. ఏదో ఆస్కార్ వచ్చింది అంటూ సంబంధం లేని కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. రెహమాన్ లాంటి గ్రేట్ మ్యూజిక్ డైరక్టర్ ను బాలకృష్ణ అలా మాట్లాడటంతో రెహమాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రెహమాన్ పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై రెహమాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు హు ఈజ్ బాలకృష్ణ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
అంతేకాదు శ్రీదేవికి డ్యాన్స్ నేర్పించింది తన తండ్రి అని.. ఆమె కాలు తొక్కి, వీర్పు మీద కొట్టి ఆమెకు డ్యాన్స్ వచ్చేలా చేశారని అన్నారు. మాధురి దీక్షిత్ కూడా డ్యాన్సర్లు చెప్పిందే చేస్తుందని అన్నారు. ఇక తన తండ్రికి భారరత్న ఇస్తే అది ఆ అవార్డుకే గౌరవం దక్కినట్టు అవుతుందని. భారతరత్న ఆయన కాలి గోటితో సమానం.. కాలి చెప్పుతో సమానం అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య.