శర్వానంద్ సినిమాకు దేవి శ్రీ ఫిక్స్..!

యువ హీరో శర్వానంద్ కొత్తగా ఒకే ఒక జీవితం సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాను శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఒకే ఒక జీవితం సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో అక్కినేని అమల కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేశారు. స్టార్ సినీమలకు వరుస హిట్లు ఇస్తున్న దేవి యువ హీరోలకు తన మార్క్ మ్యూజిక్ ఇస్తాడు.

ఇక శర్వానంద్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం ఇదే మొదటిసారి. సినిమాలో మ్యూజిక్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే దేవి శ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మహ సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు యువ హీరో.